హైదరాబాద్‌లో తొలి సారి ఏఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రతిష్టకరమైన ఐఎంఈసిఈ -2025 : సెప్టెంబర్ 10న ప్రారంభం
Date -
September 4, 2025

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎంఈ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్‌పోజిషన్ (ఐఎంఈసిఈ) తొలి భారత ఎడిషన్ 2025 సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మహాసభ సెప్టెంబర్ 10 నుండి 13 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది.

సాధరణంగా ఏఎస్ఎంఈ, ఐఎంఈసిఈ ను ప్రతీ సంవత్సరం అమెరికాలో నిర్వహిస్తుంది. కానీ తొలిసారి అమెరికా అవతల భారత్ లో హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, పరిశ్రమల నేతలు మరియు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. కీనోట్ స్పీకర్లలో డా. బాబాసాహెబ్ కళ్యాణి, మేనేజింగ్ డైరెక్టర్ – భారత్ ఫోర్జ్ గ్రూప్; శ్రీ టామ్ కోస్టాబైల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ – ఏఎస్ఎంఈ; డా. లెస్టర్ కె. సు, అధ్యక్షుడు –ఏఎస్ఎంఈ (2025–2026); డా. కళైసెల్వి ఎన్., డైరెక్టర్ జనరల్ – సిఎస్ఐఆర్ & సెక్రటరీ – డిఎస్ఐఆర్; మరియు శ్రీ పవన్ కుమార్ చందన, ఫౌండర్ – స్కైరూట్ ఏరోస్పేస్ వంటి ప్రముఖులు ఉన్నారు.

అదేవిధంగా శ్రీమతి సుసాన్ ఇప్రి-బ్రౌన్ (గత అధ్యక్షురాలు – ఏఎస్ఎంఈ), డా. యోగి గోస్వామి (ప్రొఫెసర్ – యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా), డా. జితేంద్ర శర్మ (ఎండీ & సీఈఓ – ఏఎంటిజెడ్), శ్రీ శివకుమార్ కల్యాణరామన్ (సీఈఓ – ఏయన్ఆర్ఎఫ్), డా. కనకసభాపతి సుబ్రహ్మణియన్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – అశోక్ లేలాండ్ లిమిటెడ్ & కాంగ్రెస్ చైర్ – ఐఎంఈసిఈ ఇండియా 2025), డా. మహంతేశ్ హిరేమత్ (మాజీ అధ్యక్షుడు – ఏఎస్ఎంఈ), శ్రీమతి స్టెఫనీ వియోలా (మేనేజింగ్ డైరెక్టర్ –  ఏఎస్ఎంఈ ఫౌండేషన్), శ్రీ సౌమేంద్ర బెనర్జీ (డైరెక్టర్ – హనీవెల్ యూఓపి ఇండియా), డా. జోసెలిన్ గాడిన్ (వైస్ ప్రెసిడెంట్ & హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ – ఎయిర్‌బస్ ఇండియా), డా. ఎన్. శరవణన్ (సిటివో – అశోక్ లేలాండ్ లిమిటెడ్), డా. అంషుమన్ అవస్థి (సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – మెర్సిడెస్ బెంజ్ ఆర్&డి ఇండియా), డా. ప్రదీప్ సలపక్కం (హెడ్ – ఇండస్ట్రీ సొల్యూషన్స్ & కస్టమర్ ఇంపాక్ట్ – ఆర్టిక్యుల8) తదితరులు ప్రసంగించనున్నారు.

ఈ కాంగ్రెస్ ద్వారా ఇంజినీరింగ్ రంగంలో అంతరశాఖల సహకారం, జ్ఞాన వినిమయం, ఆవిష్కరణలు మరియు ఆలోచనా నాయకత్వానికి ఏఎస్ఎంఈ ఐఎంఈసిఈ వేదికగా నిలవనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,500 మంది ప్రముఖ ఆవిష్కర్తలు, విద్యా నిపుణులు, పరిశ్రమల నేతలు మరియు ప్రభుత్వ ప్రతినిధులు ఈ తొలి భారత ఎడిషన్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌లో చేరుకోనున్నారు.

More Like This
February 17, 2025
ರೆವಾ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ನಡೆದ ಡ್ರೋನ್ ತಂತ್ರಜ್ಞಾನದ ಕುರಿತಾದ ಎ.ಎಸ್.ಎಂ.ಇ. ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಶಿಕ್ಷಣದ ವಿಚಾರ ಸಂಕಿರಣದಲ್ಲಿ ಉದ್ಯಮಕ್ಕೆ ಸನ್ನದ್ಧ ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಕಲಿಕೆಗೆ ಒತ್ತು
ಮೆಕ್ಯಾನಿಕಲ್ ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಸಮಿಟ್(MEEd) ಭಾಗವಾಗಿ ರೆವಾ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಡ್ರೋನ್ ತಂತ್ರಜ್ಞಾನದ ಎ.ಎಸ್.ಎಂ.ಇ. ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಶಿಕ್ಷಣ ವಿಚಾರ ಸಂಕಿರಣ ಮತ್ತು ಕಾರ್ಯಾಗಾರವನ್ನು ನಡೆಸಲಾಗಿದ್ದು ಇದು ತರಗತಿಯ ಕಲಿಕೆ ಮತ್ತು ಉದ್ಯಮದ ನೇತೃತ್ವದ ಡ್ರೋನ್ ಬಳಕೆಯ ನಡುವಿನ ಅಂತರ ತುಂಬಲು ಆದ್ಯತೆ ನೀಡಿತ್ತು. ವೈಮಾನಿಕ, ಉತ್ಪಾದನೆ ಮತ್ತು ಡೀಪ್-ಟೆಕ್ ಆವಿಷ್ಕಾರದ ವೃದ್ಧಿಸುತ್ತಿರುವ ಕೇಂದ್ರವಾದ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾದ ಈ ವಿಚಾರ ಸಂಕಿರಣವು ನಿಜ-ಜೀವನದ ಬಳಕೆ, ನಿಯಂತ್ರಣದ ಅಗತ್ಯಗಳು ಮತ್ತು ಡ್ರೋನ್ ಇಕಿಸೊಸ್ಟಂನಲ್ಲಿ ಉದ್ಯಮ ಪ್ರೇರಿತ ಬಳಕೆಯ ಪ್ರಕರಣಗಳಿಗೆ ಪೂರಕವಾಗಿ ಹೇಗೆ ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಶಿಕ್ಷಣವು ವಿಕಾಸಗೊಳ್ಳಬೇಕು ಎನ್ನುವುದಕ್ಕೆ ಆದ್ಯತೆ ನೀಡಿತು.
Press Release
SUBSCRIBE TO FOUNDATION FORWARD
Our quarterly newsletter with insights and updates from the ground
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.
By submitting this information, you agree to receive marketing emails from ASME Foundation and accept our privacy policy. You can opt-out at any time.