వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, రవాణా సవాళ్లను పరిష్కరించేందుకు 2025 ASME ISHOW ఇండియాలోని కార్యక్రమాలు వినూత్న పరిష్కారాలను అందిస్తాయి

హైదరాబాద్, ఏప్రిల్, 2025 – అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ASME) ఏప్రిల్ 24–25 తేదీలలో హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ప్రతిష్టాత్మకమైన ISHOW ఇండియా 2025ను నిర్వహిస్తోంది. ఈ విలక్షణ కార్యక్రమం ఇండియా వ్యాప్తంగా ఉన్న ఏడు హార్డ్‌వేర్ ఆధారిత సామాజిక వెంచర్‌లను ఒకచోటుకు చేర్చుతోంది. ఇవి వ్యవసాయం, శక్తి, ఆరోగ్య సంరక్షణ మరియు రవాణాలో క్లిష్టమైన సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
వ్యవసాయం, శక్తి, ఆరోగ్య సంరక్షణ మరియు రవాణా సవాళ్లకు సరసమైన, స్థిరమైన హార్డ్‌వేర్ సాంకేతిక రంగంలోని ఆవిష్కరణలకు The ISHOW India ventures సాంకేతిక పరిష్కారాలను అందిస్తాయి. అవి:
ఈ రెండు రోజుల కార్యక్రమంలో, ఈ స్టార్టప్‌లు ఇంటెన్సివ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటాయి. అగ్రశ్రేణి డిజైన్‌కు ఇంజనీరింగ్ నిపుణుల నుంచి అమూల్యమైన అభిప్రాయం, మార్గదర్శకత్వాలతో ప్రయోజనం పొందుతాయి. వారు ISHOW 2025 బృందంలో గౌరవనీయమైన స్థానాన్ని, గ్రాంట్ నిధులలో $30,000 వాటా కోసం పోటీ పడతారు. ఇది వారి ప్రభావవంతమైన ఆవిష్కరణల అభివృద్ధికి, మార్కెట్ ప్రారంభాన్ని వేగవంతం చేయడంలో సహాయపడేలా రూపొందించారు.
ఈ కార్యక్రమం ఏప్రిల్ 25న ఒక డైనమిక్ ఉత్పత్తి ప్రదర్శనతో ముగుస్తుంది. ఆ తర్వాత హై-ప్రొఫైల్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ వేడుకలో, ISHOW 2025 బృందంలో చేరేందుకు మూడు వెంచర్‌లను ఎంపిక చేస్తారు. సాంకేతిక మద్దతు, డిజైన్ సేవలు మరియు ASME విస్తారమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను పొంది వారి అద్భుతమైన పరిష్కారాలను మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు సహాయపడుతుంది.
స్థానికంగా ప్రపంచ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ITE&C) విభాగం మరియు పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తన హర్షాన్ని వ్యక్తం చేశారు: “భారతదేశంలోని స్టార్టప్ రాష్ట్రంగా వ్యవహరిస్తున్న తెలంగాణలో ప్రజల ప్రయోజనం కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానాలను రూపొందించడం, అమలు చేయడంలో ముందంజలో ఉంది. ఆవిష్కరణ, సామాజిక ఆవిష్కరణ మరియు అట్టడుగు స్థాయి ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణలో మూడు నిర్దిష్టమైన, ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మరియు ASME ISHOW దార్శనికలు సంపూర్ణంగా కలిసి ఉంటాయి” అని జయేష్ రంజన్ పేర్కొన్నారు. “మానవాళి ప్రయోజనం కోసం ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడమే అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ASME) లక్ష్యం, ASME ISHOW అనేది హార్డ్‌వేర్ ఆధారిత సామాజిక ఆవిష్కరణల ప్రపంచవ్యాప్త త్వరణం. అలాగే, ISHOW సానుకూల సామాజిక, పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉన్న వ్యవస్థాపకులు మరియు వెంచర్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ASME ఫౌండేషన్ ఇండియా, పని అట్టడుగు స్థాయి ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటుంది. మరియు ASME ఫౌండేషన్ ఇండియా ప్రధాన ఇంజనీరింగ్ రంగాల గురించి అవగాహన కల్పించేందుకు, సృష్టించడానికి అలాగే గ్రామీణ ఇండియాలో జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు ఇంజనీరింగ్ ఆవిష్కరణలను అమలు చేయడానికి పనిచేస్తుంది” అని వివరించారు.
ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను ASME ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ టామ్ కోస్టాబైల్ వివరిస్తూ: “ఈ ప్రతిభావంతులైన వ్యాపారవేత్తల దృష్టి, సృజనాత్మకత మరియు నిపుణుల మార్గదర్శకత్వం ద్వారా, ASME ISHOW జీవితాలను మెరుగుపరిచే మార్కెట్-రెడీ ఉత్పత్తులుగా సంచలనాత్మక ఆలోచనలను మారుస్తోంది. ఈ కార్యక్రమం శక్తి భవిష్యత్తుకు ASME మద్దతులో కీలకమైన భాగం మరియు UN సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌తో అనుసంధానించబడి ఉంది’’ అని తెలిపారు.
‘‘అత్యవసర సామాజిక మరియు పర్యావరణ సవాళ్లను పరిష్కరించే హార్డ్-టెక్ ఆవిష్కర్తలు గణనీయమైన అడ్డంకులను అధిగమించేందుకు బాగా సన్నద్ధం కావాలి’’ అని ASME సస్టైనబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఇయానా అరండా పేర్కొన్నారు. సామాజిక సంస్థలు అందరికీ మెరుగైన ప్రపంచం కోసం వారి ఆలోచనలను సాకారం చేసుకునేలా చూసుకునేందుకు మేము దశాబ్దపు అనుభవాన్ని నిర్మించడానికి అంకితభావంతో ఉన్నాము’’ అని తెలిపారు.
అదే విధంగా, ISHOW ఇండియాలో ఎంపికైన వెంచర్లు ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ బూట్‌క్యాంప్‌లో పాల్గొంటాయి. వారి ఉత్పత్తులను మరింత మెరుగుపరుచుకునేందుకు అదనపు మార్గదర్శకత్వం, డిజైన్ మార్గదర్శకత్వాన్ని పొందుతాయి. వారు ASME పెరుగుతున్న ప్రపంచ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకుల నెట్‌వర్క్‌లో కూడా చేరతారు. ప్రపంచవ్యాప్తంగా వారి వెంచర్‌లను స్కేల్ చేసేందుకు అవసరమైన వనరులు, సంబంధాలను పొందుతారు.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ISHOW ఇండియా ఈవెంట్ సామాజిక ప్రభావ రంగంలో భారతదేశంలో నిర్వహిస్తున్న ఆవిష్కర్తలను గుర్తించడంలో, మద్దతు ఇవ్వడంలో ఒక ముఖ్యమైన అడుగు వేస్తోంది విభిన్న వ్యాపావేత్తలు, నిపుణులు మరియు మార్గదర్శకులను ఒకచోట చేర్చడం ద్వారా, ఈ కార్యక్రమం శాశ్వత, సానుకూల మార్పును సృష్టించేందుకు హార్డ్‌వేర్ ఆధారిత పరిష్కారాల పరివర్తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అదే విధంగా ASME కొనసాగుతున్న మద్దతుతో, పాల్గొనే వెంచర్లు వారి ఆవిష్కరణలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి, ప్రపంచవ్యాప్తంగా జీవితాలను మెరుగుపరచాలనే వారి లక్ష్యాన్ని కొనసాగించడానికి బాగా సన్నద్ధమవుతాయి.
About ASME ISHOW
The prestigious ASME ISHOW hardware accelerator is open to individuals and organizations taking physical products to market that will have a positive social and environmental impact and that improve the quality of life around the world. ASME annually matches up to 30 carefully selected innovators/ventures with appropriate engineering experts to ensure that the proposed hardware solutions are technologically, environmentally, culturally, and financially sustainable. To date, ASME has provided support to over 250 startups from more than 35 countries to solve critical quality-of-life challenges for vulnerable populations worldwide. ISHOW alumni have developed affordable devices to address key issues related to clean combustion, crop threshing, fetal health, food waste prevention, health diagnostics, safe drinking water, and many more that advance the U.N. Sustainable Development Goals.
ASME ISHOW judges and facilitators include experts in research, sustainability, mechanical engineering and product design, manufacturing, startup financing, supply chain, and business strategy, representing industry, nonprofit organizations, and academia. These subject matter experts provide technical and strategic guidance based on ISHOW’s five key pillars: customer/user knowledge, hardware validation, manufacturing optimization, implementation strategy, and impact. For more information, visit https://www.asmeishow.org.
Follow the journeys of ISHOW alumni including GenH, PlenOptika, Himalayan Rocket Stove, SAYeTECH and others here.


@ASMEISHOW #ASMEISHOW25 #innovation #socialventures #ThisIsHardware
About the ASME Foundation
The ASME Foundation is the philanthropic arm of the American Society of Mechanical Engineers, supporting an array of programs in three core pillars: engineering education, career engagement, and global development. With the goal of empowering tomorrow's technical workforce, the ASME Foundation advances equitable access both to professional opportunities and to engineering innovations that improve quality of life. For more information, visit www.asmefoundation.org.